మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక వివాహం ఈ నెల 9న రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఉద‌య్‌విలాస్‌లో అట్ట‌హాసంగా జరిగిన విష‌యం తెలిసిందే. గుంటూరుకు చెందిన ఐజి జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో నిహారిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు అల్లు ఫ్యామిలీ అంతా పాల్గొంది.

మెగా హీరోలు ఈ వేడుక‌లో పాల్గొన సంద‌డి చేశారు. ఈ పెళ్లికి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హాజ‌ర‌వుతారా అంటే క‌ష్ట‌మే అనే పుకార్లు షికారు చేశాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ పెళ్లికి స‌రిగ్గా రెండు రోజుల ముందు ప‌వ‌న్ ఉద‌య్‌పూర్ ప‌య‌న‌మ‌య్యారు. ప్ర‌త్యేక విమానంలో బేగంపేట్ ఏయిర్‌పోర్ట్ నుంచి త‌న పిల్ల‌లు అకీరా, ఆద్య‌ల‌తో క‌లిసి ఉద‌య్‌పూర్ చేరుకున్నారు.

అయితే ఈ పెళ్లిలో రేణుదేశాయ్ మాత్రం క‌నిపించ‌క‌పోవ‌డంతో కావాల‌నే ఆమెని ఆహ్వానించ‌లేద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. దీనిపై రేణుదేశాయ్ వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. నిహారిక పెళ్లి రోజు రేణుదేశాయ్ షూటింగ్‌లో పాల్గొన్నార‌ట‌. ఆ కార‌ణంగానే త‌ను నిహారిక పెళ్లికి హాజ‌రు కాలేక‌పోయాన‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments