GHMC ఎన్నికల్లో తెరాసదే విజయం:-తెరాస యువ నేత ఉదయ్ శర్మ
జరగనున్న GHMC ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మళ్లీ మేయర్ పీఠంపై కూర్చునేది తెరాస అభ్యర్థి అని తెరాస యువనేత ఉదయ్ శర్మ తెలిపారు ఈపాటికే గ్రామాల్లో ఉండే ప్రతి కార్యకర్త సోషల్ మీడియా వేదికగా బంధుమిత్రులకు తెరాస ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని తెలియజేస్తున్నారు అదేవిధంగా గత ఆరు సంవత్సరాలుగా తెరాస ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో చేస్తున్న అభివృద్ధిని తెలియజేస్తూ ప్రతి కార్యకర్త తన బంధు మిత్రుల ను స్నేహితులను తెరాసకు ఓటు వేయాలని అభ్యర్థించారు అన్నారు అంతేకాకుండా మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు యువకులు మహానగరానికి వెళ్లి ప్రచారం చేశారని అక్కడ తెరాస విజయం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారాలు ప్రతి కార్యకర్త తిప్పికొట్టే అవసరం ఎంతో ఉందని ఈ రోజు తెరాస యువ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకులు రంజిత్ శ్రవీన్ ప్రశాంత్ నవీన్ షాదుల్లా దయాకర్ దివాకర్ రాజు నరహరి తదితరులు పాల్గొన్నారు
GHMC ఎన్నికల్లో విజయం తెరాస దే
Subscribe
Login
0 Comments