తెలుగు బిగ్‌బాస్‌ నాల్గవ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా.. తాజాగా తెలుగు పాపులర్ యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబందించిన ఓ ప్రోను తాజాగా స్టార్ మా విడుదల చేసింది. ఈ ప్రోమోలో సుమ తన సూట్ కేసుతో ప్రత్యేక్షం అయ్యింది. నాగార్జున కూడా ఎలా ఒప్పుకున్నావు.. దీనికి అంటే ఏం చేయాలీ సార్.. పాండేమిక్ అలా చేయించింది అని చెప్పి ఇంట్లోకి వచ్చినట్లు చూపించారు. అయితే ఇది నిజమా లేదా ఏమైనా ట్విస్ట్ ఉండనుంద అనేది తెలియదు. ఒకవేళా కనుక సుమ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్’లోక ఎంట్రీ ఇస్తే ఓ రేంజ్‌లో ఉంటుంది షో.. అని చెప్పవచ్చు. సుమ ఎంట్రీతో ప్రేక్షకులకు మరింత కిక్ అందనుంది. అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి ఎంట్రీగా కుమార్ సాయి ఇవ్వగా.. ఆయన ఆరవ వారంలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన హౌజ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్వాతీ దీక్షిత్ వచ్చింది. ఆమె వచ్చిన పదిరోజులకే ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం తొమ్మిదవ వారం నడుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సగం రోజుల్నీ పూర్తి చేసుకుంది. ఇప్పుడు హౌజ్ లోకి సుమ ఎంట్రీ అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే నాల్గవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మంగ్లీ అన్నారు. కానీ యాంకర్ సుమ హౌస్‌లోకి ప్రవేశించింది.

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సుమ పంచుల మీద పంచులు వేస్తోంది. సుమను తాను చిన్నప్పటి నుంచీ చూస్తున్నానని అవినాష్ అనగా.. నాగార్జున స్పందిస్తూ… ‘ ఊరుకో.. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా’ అని పంచ్ వేశారు. మా నాన్నగారితో సుమ ప్రోగ్రాములు చేసే కాలం నుంచి ఇప్పటి వరకు అలాగే ఉందని నాగ్ మరో పంచ్ వేశారు. సుమ కూడా వరుసగా అందరిపై పంచుల వేసింది. దీంతో బిగ్‌బాస్‌ మొత్తం సుమ వేస్తోన్న పంచ్‌లతో నవ్వులతో నిండిపోయింది. అయితే సుమ నిజంగానే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటారా.. లేదా ఇదేమైనా గిమ్మిక్కా తెలియాల్సి ఉంది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఇంట్లోనుంచి ఒకరు ఎలిమనేట్ కావాల్సి ఉంది. అందులో భాగంగా ఈరోజు అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments