ఎప్పుడూ క్యాప్ పెట్టని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల క్యాప్ ఎందుకు పెడుతున్నారు? ఇటీవల సంభవించిన వరదల కారణంగా హైదరాబాద్‌లోని వివిధ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వారి సహాయార్థం ఆర్థిక వరద సాయాన్ని ప్రకటించిన చిరు శనివారం హీరో నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్‌కు చెక్కుని అందజేశారు. రఘు కుంచె కూతురి పెళ్లి వేడుకతో పాటు సీఎంని కలిసిన సందర్భంలోనూ చిరు బ్లూకలర్ క్యాప్‌తో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ధరించడం వెనక చిన్న కహానీ వుందని ప్రచారం మొదలైంది. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని ఆ కారణంగానే క్యాప్‌తో కవర్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. సినీ స్టార్స్ విగ్గు పెట్టుకుని సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య విగ్గు పెట్టుకోకుండా వెండితెరపై మరింత అందంగా హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు ఆకర్షణీయమైన క్రాఫ్ లేని వారంతా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు.

ఇదే తరహాలో మెగాస్టార్ కూడా హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారట. ఆ కారణంగానే ఈ మధ్య బ్లూకలర్ క్యాప్‌ని మెయింటైన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల దర్శకుడు వి.వి.వినాయక్‌, బండ్ల గణేష్ ఓ ప్రముఖ డైరెక్టర్ కూడా ఈ మధ్య హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారని తెలిసింది. వారిలానే చిరు కూడా ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments