ఎంపీ జోగినేపల్లి సంతోష్‌ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇందులో భాగంగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్. మొక్కను నాటి వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు చెర్రీ. నిజంగా ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద మనగలుగుతాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించి తన వంతు బాధ్యతగా కొన్ని లక్షల మందిని తన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా కదిలిస్తున్న జోగినిపల్లి సంతోష్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని రామ్‌చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలీయా బట్, దర్శకుడు రాజమౌళి,తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments