బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ అందరికి సజీవ స్ఫూర్తి అని ప్రధాని మోదీ అన్నారు. అద్వానీ 93వ పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ప్రధానితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు.

‘పార్టీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లిన, దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన అద్వానీ గారికి శుభాకాంక్షలు. పార్టీ కార్యకర్తలకు, దేశానికి ఆయన సజీవ ప్రేరణ. ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments