NEW YORK, NY - AUGUST 15: US President Donald Trump speaks following a meeting on infrastructure at Trump Tower, August 15, 2017 in New York City. He fielded questions from reporters about his comments on the events in Charlottesville, Virginia and white supremacists. (Photo by Drew Angerer/Getty Images)

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తానే అధ్యక్షుడినని ఫలితాలు వెలువడక ముందే ప్రకటించుకున్న ఆయనకు.. అసలు ఫలితం మింగుడపడడం లేనట్లుంది! ఇంకా ఎన్నికల్లో తానే విజయం సాధించానని ట్విటర్‌లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ”మా పార్టీ పరిశీలకుల్ని కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఎన్నికల్లో నేనే గెలుపొందాను. 7,10,00,000 లీగల్‌ ఓట్లు సాధించాను. పదవిలో ఉండి రెండోసారి పోటీ చేసిన ఏ అధ్యక్షుడికీ ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. కానీ, మాకు అక్కడ అవకతవకలు జరిగాయి. దాన్ని మా పరిశీలకుల్ని చూడకుండా చేశారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. అడగకున్నా అనేక మందికి మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్లు పంపారు” అని ట్విటర్‌లో ఆరోపించారు.

ట్రంప్‌ ట్వీట్లపై తొలి నుంచి కాస్త కఠినంగా వ్యవహరిస్తున్న ట్విటర్‌ తాజా సందేశంపైనా ఫ్యాక్ట్‌ చెక్‌ హెచ్చరిక ఉంచింది. ఎన్నికల్లో అవినీతి జరిగిందనడం వివాదాస్పదమైన అంశమని గుర్తుచేసింది. అమెరికా ఎన్నికల ప్రక్రియలో అవినీతి చోటుచేసుకోవడం చాలా అరుదు అన్న నిపుణుల అభిప్రాయాల్ని హెచ్చరికకు జతచేసింది. అధికారంలో ఉండి రెండోసారి పోటీ చేసిన ఏ అధ్యక్షుడికీ ఈ స్థాయి ఓట్లు దక్కనప్పటికీ.. అప్పటితో పోలిస్తే 2020కి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. ఇప్పటి వరకు ఏ అభ్యర్థీ ఈ స్థాయి తేడాతో ఓడిపోకపోవడం గమనార్హం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments