తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సంస్థ ముందుకొచ్చింది. 20,761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్ట అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. అలాగే తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అమెజాన్ మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్‌లో కూడా అనేక డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయి .2022 సంవత్సర ప్రథామార్దం లో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది. తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి పెట్టడాన్ని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని అన్నారు. అమెజాన్ సంస్థ ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ తనను దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments