ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే ఎటువంటి పరిస్థితులలోనైనా తానున్నానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ వారి ఇబ్బంది తన భావించేవాడే అసలైన ప్రజానాయకుడు . అయితే ఇప్పుడు ఈ కోవకు చెందిన వారు చాలా తక్కువ మందిని చూస్తుంటాం . ఆ కొద్దిమందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు ఒకరు . ఒక జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు ప్రజల సమస్యలపై మంచి అవగాహన ఉంది . అయితే తన నిజాయితీని మరోసారి నిరూపించుకున్నారు కన్నబాబు . భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమై ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో ప్రజలు వద్దకు తాను పడవలపై వెళ్లి వారి బాగోగులను తెలుసుకొని వారికి భరోసా కల్పించారు కన్నబాబు . స్వయంగా మంత్రే తమ వద్దకు వచ్చి తమ బాగోగులను అడిగి తెలుసుకోవడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ ఉదాహరణే కాదు ఇటీవల విశాఖపట్నం లో జరిగిన LG పాలిమర్స్ ఘటనలో కూడా తానే ముందుండి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో రేయింబవళ్లు శ్రమించారు. కన్నబాబు ఈ విధంగా ప్రజలలో మమేకం అవ్వడం చూస్తుంటే ఆయన రాజకీయ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందనే దానిలో అతిశయోక్తి లేదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments