ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీలో.. నాలుగు బిల్లులను మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. GHMC చట్టానికి మొత్తం ఐదు సవరణలు చేస్తున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. 50 శాతం సీట్లలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించేలా సవరణ, హరితహారంకు పదిశాతం నిధులు, డివిజన్లలో నాలుగు రకాల వార్డు కమిటీలు వంటి సవరణలు చేపడతామన్నారు కేటీఆర్. GHMC సవరణ బిల్లుతోపాటు ఇండియన్ స్టాంప్‌ బిల్లు, తెలంగాణ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ సవరణ బిల్లు, క్రిమినల్‌ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. 1955 GHMC చట్టాన్ని సవరిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments