NEW YORK, NY - AUGUST 15: US President Donald Trump speaks following a meeting on infrastructure at Trump Tower, August 15, 2017 in New York City. He fielded questions from reporters about his comments on the events in Charlottesville, Virginia and white supremacists. (Photo by Drew Angerer/Getty Images)

కరోనా వైరస్‌ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం ఆందోళణకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌గా తేలిన రోజే ట్రంప్‌కు కృత్రిమ శ్వాస కల్పించినట్లు వైట్‌హౌస్‌ వర్గాల ద్వారా సమాచారం. మిలటరీ ఆస్పత్రికి తరలించడానికి ముందే అధ్యక్ష భవనం వైద్యులు ట్రంప్‌నకు ఆక్సిజన్‌తో శ్వాస కల్పించారని వార్తలు వినిస్తున్నాయి. రాబోయే 48 గంటల అత్యంత కీలమని వైద్యులు తెలిపారు. 74 ఏళ్ల వయసు గల ట్రంప్‌కు స్థూలకాయం, కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉన్నాయని వైద్యులు ఇదివరకే ధృవీకరించారు. ప్రస్తుతం ఆయనకు రెమ్‌డెసీవీర్‌తో పాటు యాంటీబాడీలతో కూడిన వైద్యాన్ని అందిస్తున్నారు.

అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు, నేవీ కమాండర్‌ డాక్టర్‌ సీన్‌ కోన్లీ ఆ తర్వాత ఈ విషయమై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం దాట వేశారు. మిలటరీ ఆస్పత్రిలో కూడా అధ్యక్షుడికి కృత్రిమ శ్వాస కల్పించలేదని ఆయన చెప్పారు. గడిచిన 24 గంటల్లో ఆయనకు జ్వరమే రాలేదని కోన్లీ అన్నారు. అధ్యక్షుడి సన్నిహిత వర్గాల సమాచారం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం ట్రంప్‌ ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఆయన కీలక అవయవాల పనితీరు ఆందోళనకరంగా మారింది. వచ్చే 48 గంటలు ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చాలా కీలకమైనవిగా భావిస్తున్నారు. అధ్యక్షుడు మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావచ్చని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments