ఈటీవీలో చాలా కార్యక్రమాలు ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో..? ఢీ షో నిజానికి డాన్స్ బేస్డ్ అయినా కూడా అందులో సుధీర్ కామెడీ అదిరిపోతుంది. ఆయన చుట్టూనే కామెడీ స్కిట్స్ అల్లేస్తుంటారు దర్శక నిర్మాతలు. అంత క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. ఇదిలా ఉంటే సుధీర్‌ను అల్లరి పెడుతూ కామెడీ చేయడమే ఎప్పుడూ చూస్తుంటాం. కానీ ఈయనకు ఓ అరుదైన గౌరవాన్ని కూడా ఇచ్చింది ఢీ షో.

అందులోనే కొన్నేళ్లుగా ఉంటూ తనదైన సత్తా చూపిస్తున్న సుధీర్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు కంటెస్టెంట్స్.

షోలో భాగంగా ఓ కంటెస్టెంట్ చేసిన పర్ఫార్మెన్స్ చూసి కన్నీరు పెట్టుకున్నాడు సుధీర్. దానికి కారణం ఏంటో తెలుసా.. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా సుధీర్ లైఫ్ కావడం. ఆయన జీవితాన్ని వీళ్లు 5 నిమిషాల డాన్స్‌తో చూపించారు.

దాంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. సుధీర్ లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలు.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ చూపించారు ఈ డాన్స్‌లో. దాంతో సుధీర్ కూడా కన్నీరు ఆపుకోలేకపోయాడు. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వెంటనే అక్కడున్న వాళ్లంతా వచ్చి సుధీర్‌ను కౌగిలించుకుని ఓదార్చారు.. సుధీర్ రేంజ్ ఇది అంటూ చెప్పుకొచ్చారు.

శేఖర్ మాస్టర్ సహా ప్రదీప్, రష్మి లాంటి వాళ్లంతా ఈ సెట్‌లో అందరికీ సుధీర్ అంటేనే ఎక్కువ యిష్టం అంటూ చెప్పుకొచ్చారు. అది విన్న సుడిగాలి సుధీర్ మరింత ఎమోషనల్ అయ్యాడు. మోకాళ్లపై కూర్చుని ఈ రోజు తను ఉన్న ఈ స్టేజికి కారణమైన వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మొత్తానికి అనుకోని ఈ అరుదైన గౌరవానికి సుధీర్ కూడా నోట మాట రాకుండా ఫిదా అయిపోయాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments