ఐపీఎల్ 2020 ఇంకా ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ మీద షాక్ తగులుతోంది. నిన్న జట్టులోని ఒక పేసర్, 12 మంది సపోర్ట్ స్టాఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. నేడు ఆ జట్టు స్టార్ ప్లేయర్ సురేష్ రైనా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎస్కే ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ సమయంలో మేము రైనాకు, అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తాము’ అని ట్వీట్ చేసింది.

కాగా, ఐపీఎల్ 2020 వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. యూఏఈలోని అబుదాబీ, దుబాయ్, షార్జా స్టేడియాలలో మ్యాచులు జరగనున్నాయి.

మొత్తం 54 రోజుల పాటు సాగనున్న ఈ లీగ్ ఫైనల్ నవంబర్ 10న జరగనుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ కూడా యూఏఈ చేరుకుని ఆరు రోజుల క్వారంటైన్ ను కూడా పూర్తి చేశాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments