అమ్మాయిల కలల రాకుమారుడు అక్కినేని నాగార్జున శనివారం 61వ బర్త్‌డే జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్‌డేని పురస్కరించుకొని సినీ ప్రముఖులు, అభిమానులు, కొందరు రాజకీయ నాయకులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తన ట్విట్టర్ ద్వారా నాగ్‌కు విషెస్ అందించారు. తెలుగు సినిమా రంగంలో ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్న నటులలో మీరు ఒకరు. రాబోయే రోజులలో మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు జగన్ 

జగన్ ట్వీట్‌కు స్పందించిన నాగార్జున .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు జగన్ గారికి నా ధన్యవాదాలు. మీ మాటలు నన్ను ఆనందానికి గురి చేశాయి.

మీరు ఎల్లప్పుడు ఆనందం, సంతోషంగా ఉండాలి. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ది చెందుతుంది. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అని నాగ్ ట్వీట్ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments