నూతన విద్యా విధానం సవాలుతో కూడుకున్నదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో సస్కరణలపై నిర్వహించిన సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. విద్యావిధానంపై నాలుగైదేళ్లుగా అనేక మందితో చర్చలు జరిపి జాతీయ విద్యావిధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. దీనిపై ఎంత ఎక్కువగా చర్చ జరిగితే దేశానికి అంత ప్రయోజనం ఉంటుందన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చామని, కొత్త విద్యావిధానం భావితరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మోదీ వివరించారు. . విద్యావిధానంలో సంస్కరణలు తీసుకువస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
”21వ శతాబ్దంలో యువతకు నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంలో ఉన్న శిక్షణ వ్యవస్థ పూర్తి సాధికారత సాధించలేదు. నిశిత పరిశీలన ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలి. ఏం ఆలోచిస్తున్నారనే దాని నుంచి ఎలా ఆలోచిస్తున్నారనే దానిపై దృష్టి సారించాలి. పిల్లు ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదువుకు వెసులుబాటు. నూతన విధానంలో పిల్లల మనో వికాసం మరింత వృద్ధి చెందుతుంది. పిల్లలుతమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చు” అని మోదీ సూచించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments