తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి(74) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు విషయానికొస్తే..ఈయన తన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి తెలుగులో దాదాపు 300లకు పైగా చిత్రాలకు కథ, మాటలు అందించారు. తెలుగులో మూడు తరాల హీరోలతో పని చేసిన ఘనత పరుచూరి బ్రదర్స్ సొంతం. చివరగా వీళ్లు చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి కథ సహాకారం అందించారు. స్వతహాగా స్టేజ్ ఆర్టిస్టులైన పరుచూరి బ్రదర్స్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments