నవ నవ నవతర యువతల రాజకుమారుడు… అని మహేష్‌ బాబుని ఉద్దేశించి వేటూరి రాసిన గేయమిది. నాలుగు పదుల వయస్సు దాటినా నాజుగ్గా ఉంటూ అందరికి షాక్ ఇస్తున్న మహేష్ సూపర్ స్టార్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. బాలనటుడిగా తెరంగేట్రం చేసిన మహేష్‌.. రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం విడుదలై నేటితో 21 ఏళ్ళు పూర్తైంది.ఈ సందర్భంగా అభిమానులు సినిమా జ్ఞాపకాలు పంచుకుంటున్నారు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1999, జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్టైంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా అది. ఆ తరువాత మరలా ఇప్పటి వరకు సినిమా రాలేదు. దాదాపు 5 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఆ సినిమా రూ. 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 21 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments