ప్రముఖ గాయిని సునీత గారికి నేను మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడట. కొందరు సెలబ్రెటీలతో పరిచయం పెంచుకోవడంతో పాటు కొందరి వద్ద డబ్బులు కూడా తీసుకుని మోసం చేస్తున్నాడంటూ సునీత దృష్టికి వచ్చిందట. ఈ విషయమై సునీత ఆగ్రహం వ్యక్తం చేసారు . ఫేస్ బుక్ లో ఒక వీడియోను షేర్ చేసి అతడి గురించి అందరికి తెలిసేలా చేసి మరెవ్వరు మోసపోకుండా సునీత క్లారిటీ ఇచ్చారు .చైతన్య అనే పేరుతో నాకు ఎవరు తెలియదు. అయినా అలా నా పేరు చెప్పగానే ఎలా నమ్మేస్తారు. అలా నమ్మి డబ్బులు ఇవ్వడం ఏంటీ అంటూ సునీత మోసపోయిన వారినిపై కూడా అసహనం వ్యక్తం చేసారు. ఆ వ్యక్తి నాకు కాని కనిపిస్తే చెంప పగులకొడుతాను. ఇప్పటి వరకు అతడు ఎవరు అనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు. నా పేరు చెప్పి అవకాశాలు ఇప్పిస్తానంటే ఎవ్వరు నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేసారు.

ఈ మద్య కాలంలో సెలబ్రెటీల పేర్లు చెప్పి మోసం చేయడం చాలా కామన్ గా జరుగుతుంది. మీడియాలో ఆ విషయమై పదే పదే వార్తలు వస్తున్నా కూడా జనాలు మాత్రం ఇంకా అలాగే నమ్మడం విడ్డూరంగా ఉంది. నా పేరుతో ఆ వ్యక్తి మోసం చేస్తున్నాడు కనుక నేను బాద్యతతో స్పందించాలనుకున్నాను అందుకే ఇలా మీ ముందుకు వచ్చాను. ఇకపై నా పేరు మాత్రమే కాదు ఇతర సెలబ్రెటీల పేర్లు చెప్పినా కూడా ఎవరు ఇతరులకు గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వవద్దంటూ విజ్ఞప్తి చేసారు సునీత.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments