ఈ అప్స్ మీ దేగ్గెర ఉంటె వెంటనే డిలీట్ చెయ్యండి

507

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్‌లో యాప్స్ ఎక్కువగా ఇన్‌స్టాల్ చేస్తున్నారా? కొన్ని యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తుంటాయి. అలాంటివాటిని గుర్తించిన గూగుల్ ప్లే స్టోర్ నుంచి 29 యాప్స్‌ని డిలిట్ చేసింది. ఆ యాప్స్ అన్నీ యాడ్‌వేర్‌తో ఉండటం, యూజర్లకు యాడ్స్ ఎక్కువగా చూపిస్తూ చికాకు తెప్పించడం, స్మార్ట్‌ఫోన్‌లోని బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తుండటం లాంటి సమస్యల్ని గూగుల్ గుర్తించింది. ఒకే పేరుతో రెండు మూడు యాప్స్ ఉన్నట్టు గూగుల్ పరిశీలనలో తేలింది. 19 పేర్లతో ఉన్న 29 యాప్స్‌ని గూగుల్ తొలగించింది. ఇప్పటికే ఆ యాప్స్‌ని 35 లక్షల సార్లు డౌన్‌లోడ్ చేసినట్టు లెక్క తేలింది. మొదట ఈ యాప్స్‌ని థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ వైట్ ఆప్స్ సటోరీ గుర్తించింది. ఈ విషయం గూగుల్ దృష్టికి రావడంతో ఆ యాప్స్‌ని వెంటనే ప్లేస్టోర్ నుంచి డిలిట్ చేసింది.

ఫోటోలు బ్లర్ చేయడానికి ఉపయోగించే యాప్స్ ఇవి. వీటిని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలో యాడ్స్ వస్తుంటాయి. యాప్ ఆపరేట్ చేస్తున్న సమయంలోనే కాదు ఫోన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువగా యాడ్స్ కనిపిస్తుంటాయి. మీరు ఫోన్ అన్‌లాక్ చేసినా, ఛార్జింగ్ చేసినా, వైఫై ఆన్ చేసినా సంబంధం లేకుండా యాడ్స్ కనిపిస్తుంటాయి. ఈ యాప్స్‌లో యాడ్ వేర్ ఉండటమే ఇందుకు కారణం. ఒకవేళ మీరు ఈ యాప్స్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే వాటిని డిలిట్ చేయడం మంచిది. మరి 19 పేర్లతో ఉన్న ఆ 29 యాప్స్ జాబితా ఏదో తెలుసుకొని వాటిని డిలిట్ చేయండి.

Auto Picture Cut
Color Call Flash
Square Photo BlurSquare Blur Photo
Magic Call Flash
Easy Blur
Image Blur
Auto Photo Blur
Photo Blur
Photo Blur Master
Super Call Screen
Square Blur Master
Square Blur
Smart Blur Photo
Smart Photo Blur
Super Call Flash
Smart Call Flash
Blur Photo Editor
Blur Image

ప్రస్తుతం ఈ యాప్స్ ఏవీ గూగుల్ ప్లేస్టోర్‌లో లేవు. అయితే ఇప్పటికే వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నవారి స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం అలాగే ఉంటాయి. అందుకే వీటిని డిలిట్ చేయడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here