చిరంజీవి సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఆయన సినిమా అప్ డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అయ్యిందంటే పూనకాలతో ఊగిపోతారు. కాగా ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మూవీ అనంతరం లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు చిరు. ఆ ప్రాజెక్ట్ బాధ్యతలు యంగ్ డైరెక్టర్ సుజీత్ కు అప్పగించింది మెగా కాంపౌండ్. అంతేకాదు సుజీత్ తెలుగు నేటివిటికి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుజీత్ చేసిన మార్పులు, ఆయన చేసిన చేర్పులు చిరంజీవికి నచ్చలేదట. సుజీత్ రాసిన స్క్రిప్ట్‌తో సంతృప్తి చెందని చిరు ఈ క్రేజీ ప్రాజెక్టును అనుభవం ఉన్న డైరెక్టర్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగా ఈ సినిమాను వినాయక్‌తో చేయాలనీ నిర్ణయానికి వచ్చాడట. వినాయక్, చిరంజీవి కాంబినేషన్‌లో గతంలో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 చిత్రాలు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్టైనా సంగతి తెలిసిందే. మరోసారి వినాయక్ మెగాస్టార్ డైరెక్ట్ చేయబోతున్నాడా అనేది తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే ఎదురుచూడాలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments