గత కొద్దికాలంగా బాలీవుడ్, టాలీవుడ్ లను విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌ ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు తుదిశ్వాస విడిచారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కొండలరావు ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు చిరంజీవి. ఈయన మరణవార్త వినగానే తను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని లేఖలో పేర్కొన్నారు మెగాస్టార్. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో రావి కొండలరావుది సుదీర్ఘ ప్రయాణం అని.. ఆయనకు ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు చిరంజీవి. నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా రావికొండల రావు మరణం ఒక తీరని లోటన్నారు.రావి కొండల రావు ఆయన సతీమణి రాధా కుమారి జంటగా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగా వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేదని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments