ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో .జిల్లాల పరిస్థితిపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇవాళ 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారని వివరించారు. కానీ కేసులు ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టుల్లో తగ్గించి చూపే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు.

రోజూ చేసే కరోనా పరీక్షల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనదేనని ఉద్ఘాటించారు. ప్రతి 10 లక్షల మందిలో 31 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 90 శాతం పరీక్షలు కొవిడ్ క్లస్టర్లలో జరుగుతున్నాయని వివరించారు. కేసులు ఎక్కువగా వస్తున్నాయని భయపడి పరీక్షలు తగ్గించడం, రిపోర్టులు తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ ఏపీలో మాత్రం ఎప్పుడూ అలా జరగలేదన్నారు, ‘కరోనా వస్తుంది.. పోతుంది.. దానికి భయపడాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు’ఇప్పటి పరిస్థితుల్లో కొవిడ్ తో కలిసి జీవించక తప్పద’ని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments