ఎప్పుడూ రాజ‌కీయాల‌పై. రాజ‌కీయ నాయ‌కుల‌పై కామెంట్‌లు చేయ‌ని న‌టుడు రాజా ర‌వీంద్ర తొలి సారి ఏపీరాజ‌కీయాల‌పై స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఏపీలో ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు లేర‌ని అభినంద‌నలు కురిపించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నడిపించే తీరు, సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేస్తున్న విధానం చూస్తుంటే ప్ర‌తీ ఒక్క‌రు త‌మ ఇంట్లో దేవుడి ఫోటో తో పాటు ఆయ‌న ఫొటోని కూడా పెట్టుకునే రోజు వ‌స్తుంద‌న్నారు.

విద్య‌, ప్ర‌జారోగ్యంపై వైఎస్ జ‌గ‌న్ పెడుతున్న శ్ర‌ద్ధ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వాలు పెట్ట‌లేద‌ని, నిజంగా ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ అభినంద‌నీయుల‌ని కొనియాడారు. ఈ రెండింటి వ‌ల్ల జ‌గ‌న్ దేశ వ్యాప్తంగా గుర్తింపును పొందుతార‌ని, చిన్న వ‌య‌సులోనే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని పోరాడి నిల‌చి సీఎం ప‌ద‌విని పొంద‌డం మామూలు విష‌యం కాద‌ని, ఖ‌చ్చితంగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల గుండెల్లో గుర్తుండిపోతార‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌త కొంత కాలంగా యువ హీరోల‌కు మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న రాజా ర‌వీంద్ర క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభిస్తున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని రాజా రవీంద్ర వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments