కరోనా నేపథ్యంలో నాలుగు నెలలుగా మూతపడ్డ థియేటర్లు ఎప్పుడు రీఓపెన్ అవుతాయనే దానిపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి సినిమా థియేటర్లని రీఓపెన్ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కేసులు పెరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్ల రీఓపెన్ రిస్క్ తో కూడుకున్న పని అని పలువురు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100కిపైగా థియేటర్లను లీజుకు తీసుకున్న అగ్రనిర్మాత సురేశ్ బాబు ఇప్పడప్పుడే థియేటర్లను రీఓపెన్ చేయడానికి సిద్దంగా లేరట. ఇటువంటి టైంలో థియేటర్లు ఓపెన్ చేయడం రిస్క్ తో కూడిన పని. థియేటర్లలో 3 గంటలపాటు ఉండి..జీవితాలను రిస్క్ లో పెట్టే అవకాశం ఉంటుందని, ఇది చాలా ప్రమాదకరమని సురేశ్ బాబు ఓ ఇంటర్య్వూలో అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు తగ్గిన తర్వాత చైనాలో థియేటర్లు ఓపెన్ చేశారు. కానీ వారు మళ్లీ థియేటర్లను మూసివేశారు. దీన్ని మనమంతా ఓ ఉదాహరణగా తీసుకోవాలని, వ్యాపార దృక్పథంతో ఆలోచించొదు. ఇలాంటి టైంలో ప్రభుత్వం థియేటర్లు రీఓపెన్ చేసుకునే అవకాశమిస్తుందని తాను అనుకోవడం లేదని సురేశ్ బాబు అభిప్రాయపడ్డారు.