టాలీవుడ్‌లో పెళ్ళిళ్ల హంగామా న‌డుస్తోంది. ఎన్న‌డూ లేని విధంగా వ‌రుస పెళ్లిళ్లు , ముహూర్తాలు, ఎంగేజ్‌మెంట్లు జ‌రుగుతున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని వాళ్లు ఈ సీజ‌న్‌లో వివాహాలు చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. గ‌త కొంత కాలంగా పెళ్లంటే ఆమ‌డ‌దూరం పారిపోయిన వాళ్లంతా ఇప్పుడు పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇటీవ‌ల దిల్ రాజు రెండ‌వ పెళ్లితో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హంగామా మొద‌లైంది. ఆ త‌రువాత నిఖిల్ వివాహం. తాజాగా నితిన్ వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

గ‌త కొంత కాలంగా ఈ అంద‌రి కంటే ముందుగా మెగాడాట‌ర్ కొణిదెల నిహారిక పెళ్లిపై వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా గుంటూరుకు చెందిన ఓ ఐజీ కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ చైత‌న్య‌ని నిహారిక గ‌త కొంత కాలంగా ప్రేమిస్తోంది. ఈ ఇద్ద‌రి ప్రేమ‌ని ఇరు కుటుంబాల వాళ్లు అంగీక‌రించి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఈ ఆగ‌స్టులో ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌బోతోంది.

వివాహాన్ని డిసెంబ‌ర్‌లో జ‌ర‌పాల‌ని ఇరు కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ముహూర్తం మాత్రం ఫిక్స్ చేయ‌లేద‌ట‌. ఏది ఏమైనా డిసెంబ‌ర్‌లోనే వివాహం చేయాల‌ని మెగా కుటుంబం నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తాజా అప్‌డేట్‌. ఆ కార‌ణంగానే నిహారిక కొత్త ప్రాజెక్ట్‌లు అంగీక‌రించ‌డం లేదు. ప్రొడ్యూస‌ర్‌గా కూడా వెబ్ సిరీస్‌ల‌ని ప్లాన్ చేయ‌డం లేద‌ని ఇండ్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments