ప్రముఖ సోషల్ వెబ్ సైట్ ఇన్స్టాగ్రామ్ లో ఏడు కోట్ల ఫాలోవర్స్ ను సాధించుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ సంఘటనతో విరాట్ కోహ్లీ భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా ఫాలోవర్స్ ను పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక మంది అనుసరిస్తున్న వ్యక్తుల్లో విరాట్ కోహ్లీ నాలుగో వాడిగా నిలిచాడు. ఈ మార్క్ ను అందుకున్న మొదటి క్రికెట్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు.


ఇక ప్రపంచవ్యాప్తంగా పోర్చుగల్ దేశానికి చెందిన ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో 23 కోట్ల 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బార్సిలోనా దేశానికి చెందిన స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సి కి 16 కోట్ల 10 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఇక మూడో స్థానంలో బ్రెజిల్ దేశానికి చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ నెయిమర్​ కు 14 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తాజాగా నాలుగో స్థానంలో ఉన్న బాస్కెట్ బాల్ స్టార్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ ను దాటుకొని కోహ్లీ నాలుగో స్థానాన్ని పొందాడు.

ఇక భారతదేశం విషయానికి వస్తే…. కోహ్లీ తర్వాత ప్రియాంకచోప్రా ఐదు కోట్ల 50 లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఇటీవల వెయ్యి పోస్టుల మార్కును దాటిన సంగతి విధితమే. కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన లాక్ డౌన్ లో వర్క్ ఔట్ వీడియో లతోపాటు తన నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు ఈ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏకంగా రూ 3 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాడు అని ఇటీవల ఓ సర్వే తెలిపింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments