ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్..ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ పేద రైతు రైతు కుటుంబానికి ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూ ఒక్కసారిగా ప్రజల దృష్టిలో రియల్ హీరో అయ్యాడు. దీంతో ఇకపై సోనూని సినిమాల్లో విలన్ పాత్రల్లో చూడలేమని ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా సోనూ గురించి స్పందిస్తూ.. తనను విలన్ పాత్రలో చూడలేనని తెలిపాడు. సినిమాల్లో హీరోపాత్ర వేయాల్సిందేనన్నారు. టాటా, మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం అన్నారు. అయితే ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదని ప్రశంసించారు. వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్, విదేశాల్లో ఉన్న విద్యార్థుల విషయంలో సోనూసూద్ చొరవ అభినందనీయమని తెలిపారు.