కరోనా కారణంగా మూడునెలలు ఆలస్యంగా మూడుముళ్ల బంధంతో ఏడడుగులు నడిచారు హీరో నితిన్-షాలినీ. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్‌-షాలినీల వివాహం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించి, తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిపారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రులు తలసాని, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వివాహం అనంతరం షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన నితిన్‌ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని పేర్కొన్నారు. వివాహానికి ముందే నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌ దే’. టీజర్ విడుదల చేసి గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ టీజర్ నితిన్ అభిమానులను సంబరపడేలా చేసింది. భీష్మ హిట్ తర్వాత ఈ సినిమా రానుండడంతో అభిమానులు రంగ్ దే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తీ సురేష్‌ కథానాయిక. నితిన్‌ పెళ్లి సందర్భంగా ‘ఏ క్యూట్‌ మ్యారేజ్‌ గిఫ్ట్‌ టు అవర్‌ హీరో’ అంటూ ‘రంగ్‌ దే’ టీమ్‌ టీజర్‌ని విడుదల చేసింది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments