ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితంపై బుర‌ద జ‌‌ల్లే దురుద్దేశంతో రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన చిత్రం ప‌వ‌ర్‌స్టార్‌. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ స్టిల్స్ దగ్గ‌రి నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌ధ్య వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. టీజ‌ర్, గ‌డ్డి తింటావా వీడియో సాంగ్ రిలీజ్ చేసిన త‌రువాత వ‌ర్మ‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ యుద్ధం ప్ర‌క‌టించారు. వ‌ర్మ ఆఫీస్‌కి వెళ్లి భీభ‌త్సం సృష్టించ‌డం, ఆ త‌రువాత పోలీసులు రావ‌డం తెలిసిందే.

ఇదిలా వుంటే వ‌ర్మ రిలీజ్ చేసిన ప‌వ‌ర్‌స్టార్‌ చిత్రంలోని ట్రైల‌ర్‌లో ప‌వ‌న్‌ని ఉద్దేశించి మెగాస్టార్ పాత్ర‌ధారి చెబుతున్న డైలాగ్‌ల‌కు సంబంధించిన వీడియోని వ‌ర్మ ట్వీట్ చేస్తే దాన్ని బండ్ల గ‌ణేష్ లైక్ కొట్టాడు. ఈ విష‌యం గ‌మ‌నించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్ బండ్ల గ‌ణేష్‌ని నిల‌దీయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బండ్ల గ‌ణేష్ అన్న గ‌దంత కాదు గిది ఎందుకు లైక్ చేసిన‌వ్ అని ఓ అభిమాని నిల‌దీయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

దీంతో జ‌రిగిన త‌ప్పు తెలుసుకున్న బండ్ల గ‌ణేష్ `అది తెలియ‌కుండా జ‌రిగింద‌ని, త‌న‌ను క్ష‌మించాల‌ని ఈ సంద‌ర్భంగా బండ్ల గ‌ణేష్ స్ప‌ష్టం చేశాడు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ శాంతించారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బండ్ల గ‌ణేష్ వీర భ‌క్తుడిగా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments