దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలాగే మెగా బ్రదర్స్ మధ్య ఎప్పటి నుండో వివాదం చెలరేగుతుంది. వర్మ చాలాసార్లు ఆ ముగ్గురు బ్రదర్స్ ను ఉదేశించి ట్విట్స్ చేసారు. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, నిర్మాత చినబాబుతో కలిసి నిన్న హీరో నితిన్ మెహందీ వేడుకలకు హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్న పవన్ దీక్షకు సంబంధించిన డ్రెస్ లోనే వేడుకకు హాజరయ్యి నితిన్ ను ఆశీర్వదించారు. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటో పైన వర్మ స్పందించారు. తన ట్విట్టర్ లో పవన్ – త్రివిక్రమ్ ఉన్న ఫోటో పోస్ట్ చేస్తూ ”బాబు బాబా గా మారిపోయారా..?” అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత కేవలం పవన్ ఫోటో పోస్ట్ చేసిన వర్మ ”నేను మాములుగా బాబులను బాబాలను నమ్మను. కానీ ఈ బాబు బాబాను మాత్రం నేను నమ్ముతున్నాను. నాకు మీ ఆశీర్వాదం కావాలి” అని ట్వీట్ చేసాడు వర్మ. ఇక ఇంతకముందులాగానే వర్మ ట్విట్స్ పైన పవర్ స్టార్ ఫాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments