ఈ రోజు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) పుట్టిన రోజు. నేడు 45వ వసంతంలోకి ఆయన అడుగుపెట్టారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువ మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ.. డియర్ తారక్.. నువ్వు ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటావు. ఆ విషయం నాకు ఆనందం కలిగించేది. ప్రజల ప్రతి అవసరాన్ని తన అవసరంగా భావించి వాళ్ల కోరికలు తీర్చడంలో ముందుంటావు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments