పవర్ స్టార్ పేరుతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను తెరెకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ లు కూడా విడుదల చేసారు. కాగా వర్మ బుధవారం ఉదయం 11 గంటలకు చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే ట్రైలర్ ను తన ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ లో డబ్బులు పెట్టుకుని చూడాలని చెప్పారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో దానికి రూ. 20 టికెట్ కూడా పెట్టాడు. కాగా తాజాగా ఆర్జీవీ తన “పవర్ స్టార్ “సినిమా ట్రైలర్ ను తమ సిబ్బందిలో ఎవరో లీక్ చేసారని, దాంతో ఇప్పటికే డబ్బులు చెల్లించినవారికి వారి డబ్బులను తిరిగి ఇచ్చేస్తానని ట్వీట్ చేసారు. ట్రైలర్ ను లీక్ చేసినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే వర్మ చేసిన ట్వీట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ట్రైలర్ కు అసలు ఎవరూ డబ్బులు కట్టలేదేమో అందుకే విడుదల చేసి వర్మ కొత్త ప్లాన్ వేసాడంటూ కామెంట్ చేస్తున్నారు.
ట్రైలర్ కి డబ్బులు రిటన్ చేస్తాం : రామ్ గోపాల్ వర్మ
Subscribe
Login
0 Comments