కరోనా కారణంగా వాయిదా పడిన నితిన్‌, షాలినిల ఎంగేజ్‌మెంట్‌ ఈ రోజు హైదరాబాద్‌లో షాలిని ఇంటిదగ్గర సింపుల్‌గా జరిగింది. నితిన్‌, షాలినిల కుటుంబసభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఇద్దరి వివాహ వేడుక ఈ నెల 26న ఉదయం 8గంటల 30 నిమిషాలకు ఫలక్‌నామా ప్యాలెస్‌లో జరగనుంది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ వివాహం జరగనుంది.

ఐదు రోజుల పాటు జరగనున్న పెళ్ళి సంబురాలకి కేవలం కుటుంబ సభ్యలు మాత్రమే పాల్గొననున్నారట. ఇక వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌తో పాటు పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.కాగా, ఫిబ్రవరిలో నితిన్‌, షాలినిల పసుపు, కుంకుమ వేడుక జరిగిన విషయం విదితమే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments