ఒకప్పుడు సెన్సేషన్స్కు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాడు. ఆయన తీసే సినిమాలే ఆయనపై విమర్శలకు కారణమవుతున్నాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పవర్‌స్టార్’. ఈ సినిమాలో పాత్రధారులు పవన్‌కల్యాణ్, చిరంజీవిలను పోలి ఉండటం, సినిమా అంతా రాజకీయాల చుట్టూ తిరుగుతుండడంతో పవన్‌కల్యాణ్ అభిమానులు ఆర్జీవీపై కోపంగా ఉన్నారు. కొందరు వర్మపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీస్తుంటే.. మరికొందరు డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు.
తాజాగా పవన్ అభిమాని అయిన హీరో నిఖిల్ ఒక్కసారిగా వర్మపై ఫైర్ అయ్యాడు. ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థమయ్యిందిగా’ అంటూ నిఖిల్ ఆర్జీవీని తిడుతూ ట్విటర్లో పోస్ట్ చేశాడు.