కరోనా వైరస్ తెలంగాణలో రోజు రోజుకు విస్తరిస్తోంది. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవర్ని కరోనా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొందరు చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయ్యారు. తాజాగా మరో ప్రజాప్రతినిధి కరోనా పడ్డారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కడియం శ్రీహరి, ఆయన గన్ మెన్, పీ. ఏలు ఐసోలేషన్ కి వెళ్లారు. ఇక వరంగల్ లో ప్రజాప్రతినిధులను కరోనా మహమ్మారి వణికిస్తున్నదని చెప్పచ్చు. మేయర్ గుండా ప్రకాష్ రావు దంపతులకు కరోనా పాజిటివ్ రాగా వారుహైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటికే కరోనాను జయించిన జనగామ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి & కుటుంబం ప్రస్తుతం కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇక ఈ టెన్షన్ తో పలువురు ప్రజాప్రతినిధులు హోమ్ క్వారెంటైన్ లోనే ఉంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments