ఏపీ విద్యావిధానంలో సంచలన మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పీపీ-1, పీపీ-2గా ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేయాలన్న ఆయన.. ఇందులో కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించాలన్నారు. తాజాగా విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇక నుంచి స్కూళ్ల ప్రక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు లేవన్న ఆయన.. ప్రైమరీ స్కూళ్ల దగ్గర కేంద్రాలు ఉండేందుకు సరైన స్థలాలు ఉన్నాయా.? లేవా.? అనేది పరిశీలించి నివేదికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. పీపీ-1, పీపీ-2 క్లాసులను ప్రాధమిక విద్య పరిధిలోకి తీసుకురావాలని.. అలాగే వీటి ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం జగన్ తెలిపారు. అందుకోసం పీపీ-1, పీపీ-2కు ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఒకటో తరగతికి బోధించే పాఠాలు, పీపీ-1, పీపీ-2 పాఠ్యాంశాల మధ్య సినర్జీ ఉండాలని సీఎం జగన్ వెల్లడించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments