పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు 30ఏళ్ల ప్రణాళికతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శాతవాహన వర్సిటీలో మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో గ్రామీణ ప్రజల జీవితాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుందన్నారు. తాగు, సాగునీరు, విద్యుత్‌ ఇబ్బందులను తక్కువకాలంలో అధిగమించామన్నారు.

”కేవలం మూడేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. భవిష్యత్‌ తరాలు బాగుండాలని 230 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. త్వరలో తీగల వంతెనను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. కరీంనగర్‌కు కొత్త శోభను తీసుకువచ్చేలా జంక్షన్‌ రూపొందించాలి.

టీహబ్‌ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్‌లో ఏర్పాటు కాబోతోంది. పరిశ్రమల ఏర్పాటుకు ఇతర దేశాల్లో స్థిరపడిన వారికి ఇది మంచి అవకాశం. దేశానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది” అని కేటీఆర్‌ వివరించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments