మెగాస్టార్ చిరంజీవి గురించి చిన్న పిల్లాడినడిగిన చెప్తాడు. చిరంజీవి డ్యాన్స్ లకు నటనకు అభిమాని కాని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు, మెగాస్టార్ చిరంజీవి రీల్ లోనే కాదు రియల్ గాను హీరోనే అంటుంది సీనియర్ నటి సుహాసిని. ఇటీవలే సుహాసిని ఓ సందర్భంలో మాట్లాడుతూ అప్పట్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో ఓ సినిమా షూటింగ్ నేపథ్యంలో కేరళ వెళ్లారట. అక్కడ కొందరు రోడ్డు మీద తప్ప తాగి చిరంజీవి సుహాసిని ప్రయాణిస్తున్న కారును ఆపి.. కారు మీదికి బీర్ సీసాలు విసిరారట. దాంతో చిరుకి కోపం వచ్చి తన దగ్గరున్న లైసెన్స్ రివాల్వర్ తీసి వాళ్ళను బయపెట్టారట . ఆ దెబ్బతో ఆ ఆకతాయిలు అక్కడి నుండి పారిపోయారట. ఈ విషయం చెబుతూ సుహాసిని “చిరు స్క్రీన్ మీదే కాదు.. స్క్రీన్ బయట కూడా హీరోనే” అంటూ పొగిడేసింది సుహాసిని .
Subscribe
Login
0 Comments