హాయ్ ర‌బ్బా ఫేమ్ తెలుగు పాప్ సింగ‌ర్ స్మిత వార్త‌ల్లో నిలిచారు. పాప్ గీతాల‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి తెలుగులో స‌రికొత్త వొర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టిన స్మిత యోగా, మెడిటేష‌న్‌తోనూ పాపుల‌ర్ అయ్యారు. త‌న పాప్ ఆల్బ‌మ్స్‌కు సంబంధించిన స‌మాచారాన్ని అభిమానుల‌తో పంచుకుంటూనే ప‌లు సామాజిక అంశాల‌పై గ‌త కొంత కాలంగా త‌న‌ గ‌ళాన్ని వినిపిస్తున్నారు.

అయితే ఆమె ఫేస్ బుక్ పేజీలో తాజాగా పిచ్చి పిచ్చి ఫొటోలు, మెసేజ్‌లు క‌నిపించ‌డం అభిమానుల్ని, క‌ల‌వ‌రానికి గురిచేసింది. స్మిత ఫేస్ బుక్ పేజీని ఎవ‌రో హ్యాక్ చేశారు. త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన రీతిలో ఆమె పేజీలో వ‌ల్గ‌ర్ ఫొటోలు, మెసేజ్‌లు పెట్ట‌డంతో విష‌యం తెల‌సుకున్న స్మిత వెంట‌నే ఫేస్ బుక్ టీమ్‌ని సంప్ర‌దించింది. వెంట‌నే ఆమె పేజీని తిరిగి హ్యాక‌ర్స్ నుంచి సుర‌క్షితంగా అప్ప‌గించారు.

ఈ విష‌యం తెలిసిన త‌రువాత స్మిత ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది. `ఇది ఒక మ్యాడ్ డే. నరకంగా ఉంది. నా ఎఫ్‌బీ పేజీ హ్యాక్ అయింది. ఎవరో తెలివితక్కువ కంటెంట్‌ను పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇది ఇప్పుడు తిరిగి వచ్చింది. దీనిపై పని చేసినందుకు, ఈ పేజీని త్వరగా పునరుద్ధరించిన ప్రతి ఒక్కరికీ మరియు ఎఫ్‌బీ బృందానికి ధన్యవాదాలు. ఏదైనా అసౌకర్యానికి గురిచేసి వుంటే క్షమించండి. అని స్మిత పోస్ట్ చేసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments