సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఏదైనా సినిమా నచ్చితే ఏమాత్రం మొహమాటం లేకుండా దాని గురించి సోషల్ మీడియాలో స్పందిస్తాడు. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ జర్మన్ సిరీస్ డార్క్ గురించి స్పందించాడు మహేష్ బాబు. ఈ వెబ్ సిరీస్ ను జర్మన్ ఆడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడండి.. అదిరిపోతుంది అని ట్వీట్ చేసాడు మహేష్. అలాగే ఇప్పుడు ఒక తమిళ సినిమా గురించి రియాక్ట్ అయ్యాడు.

తమిళ చిత్రం ఓ మై కడవులే అదిరిపోయింది. దర్శకుడు అశ్వత్ మరిముత్తు రైటింగ్ అండ్ డైరెక్షన్ అద్భుతంగా ఉంది. అశోక్ సెల్వన్ న్యాచురల్ యాక్టర్ అని ట్వీట్ చేసాడు. ఫిబ్రవరి 14న తమిళంలో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం జీ5 లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.

ఓ మై కడవులే టీమ్ మహేష్ ట్వీట్ పై రియాక్ట్ అయింది. అశోక్ సెల్వన్ ఇది కచ్చితంగా ఓ మై కడవులే మూమెంట్. థాంక్యూ వెరీ మచ్ సర్ అని రెస్పాండ్ అయ్యాడు. ఈ చిత్ర హీరోయిన్ రితిక సింగ్ స్పందిస్తూ ఇది కలా నిజమా! మీ నుండి ఈ ప్రశంస నిజంగా సూపర్ అని అంది. ఇక దర్శకుడు మాట్లాడుతూ నా ఫేవరెట్ హీరో నుండి ఈ ట్వీట్ రావడం నిజంగా అద్భుతంగా ఉంది అని అన్నాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments