‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా యాక్టర్‌గా అవతారమెత్తాడు.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్. ‘కెజిఎఫ్2’ కోసం దేశమంతా ఆత్రుతతో ఎదురుచూస్తుందంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది. తన యాక్టింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే సత్తా ఉన్న నటుడు యశ్. ప్రస్తుతం ‘కేజీఎఫ్’ సినిమాకి సీక్వెల్ గా ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.కాగా యశ్ తన మొదట సినిమా ‘మొగ్గిన మనసు’ రిలీజై జులై 18కి పన్నెండేళ్ళు పూర్తయింది. ఈ సినిమాతోనే యశ్ సతీమణి రాధికా పండిట్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ క్రమంలో ‘రాకీ’ ‘గోకుల’ ‘మొదల సాల’ ‘రాజధాని’ ‘కిరాతక’ ‘డ్రామా’ ‘గజకేసరి’ ‘గూగ్లీ’ ‘రాజాహులి’ ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు యశ్. ఇక ‘కేజీఎఫ్’ సినిమాతో యశ్ నేషనల్ వైడ్ స్టార్ గా మారిపోయారు.
యశ్ సినీ ప్రయాణానికి 12 ఏళ్ళు
Subscribe
Login
0 Comments