ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఈ పోస్టర్ ఏమంత కొత్తగా లేదు అంటూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘రాధే శ్యామ్’ మూవీ తర్వాత ప్రభాస్.. మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రకటన సందర్బంగా ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ఈచిత్రాన్ని నాగ్ అశ్విన్.. మన పురాణ కథల ఆధారంగా ఇప్పటి సమాజానికి అన్వయిస్తూ ఈ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సినిమా ప్రభాస్.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘ రాధే శ్యామ్ ‘ చిత్రం కంప్లీటయ్యే దానిపై ఆధారపడి ఉంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేసిన తర్వాత కానీ నాగ్ అశ్విన్ చిత్రం సెట్స్ పైకి వెళ్లేలా లేదు. ఇప్పటికే నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విలన్‌గా పలువురు హీరోల పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంకా ఎవరు ఫైనల్ కాలేదని సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments