సాయి పల్లవి.. అద్భుతమైన నటే కాదు మంచి డ్యాన్సర్ కూడా. సెన్సేషనల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఢీ 4లో కంటెస్టెంట్‌గా ఎంటరైన సాయి పల్లవి ఆ తరువాత నటిగా మంచి గుర్తింపును, ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సాయి పల్లవికి నటన ఎంత ఇష్టమో డ్యాన్స్ అంటే అంతకుమించి ఇష్టం. దీనికి నిదర్శనంగా నిలిచిన పాట రౌడీ బేబీ..
. ఈ పాట య్యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
తన అద్భుతమైన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి త్వరలో కొరియోగ్రాఫర్ గా కనిపించబోతోంది. అది కూడా తను నటిస్తున్న చిత్రంలోని ఓ పాట కోసమని తెలిసింది. సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం లవ్‌స్టోరీ
. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారు.
ఈ 20 రోజుల షూటింగ్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట బ్యాలెన్స్‌గా వుందట. ఈ పాటకు సాయి పల్లవిని కొరియోగ్రాఫ్ చేయమని దర్శకుడు శేఖర్ కమ్ముల అడిగారట. ఆఫర్ నచ్చడంతో సాయి పల్లవి వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ పాటలో సాయి పల్లవే కనిపించనుందట.