తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తుంది. అనేక మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356 మంది చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో కన్నుమూశారు.

ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవల గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా నరేందర్ పాల్గొన్నారు. దీంతో నరేందర్ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. కాగా నరేందర్ మృతికి పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments