పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ వుంటారు. జనసేన పార్టీ పెట్టాక ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు తర్వాత అత్యధికమంది ఫాలోవర్లు వున్న నేతగా పవన్ ఎదిగారు. ఆయన దెబ్బకు ట్విట్టర్ షేక్ అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 లక్షలమంది పవన్ ని ఫాలో అవుతున్నారు.పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4మిలియన్స్ దాటడంతో ఆయన స్పందించారు. కేవలం ఈ ఆరు నెలల్లోనే పవన్ కళ్యాణ్ అత్యధిక మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. జన సైనికుల బలం పెరుగుతున్నందుకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రాజకీయ నేతలకు ట్విటర్ ఫాలోవర్లు ఎక్కువగానే వున్నారు. తాజాగా ట్విట్టర్ లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1.6మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువ స్థాయిలో 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లో విలక్షణమయిన సంప్రదాయానికి నాంది పలికారు. ఇటీవల ఏపీ సీఎం జగన్ చేపట్టిన 104, 108 అంబులెన్స్ సేవలపై ప్రశంసలు కురిపించారు పవన్. రాజకీయాల్లోనే కాకుండా పవన్ సినిమాలతో కూడా మళ్ళీ బిజీ కానున్నాడు. వకీల్ సాబ్ అనంతరం, క్రిష్, హరీశ్ శంకర్ వంటి వారితో సినిమాలు చేస్తున్నాడు. కరోనా బారిన పడిన బిగ్ బి అమితాబ్ త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టుగా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా అమితాబ్ ఆరోగ్యం పట్ల చింతిస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు పవర్ స్టార్ చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంటోంది..’మాకు ఎంతో ప్రియమైన అమితాబ్ బచ్చన్ గారికి.. మీకు కూలీ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలిసినప్పుడు మేమంతా ఆందోళనకు గురయ్యాం.

మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ మొత్తం మీ కోసం ప్రార్థనలు చేశాం. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.మీరు ఎల్లప్పుడూ అమితమైన ప్రేమ, విధేయత, ఆప్యాయతను చూపిస్తూనే ఉన్నారు. మీ ప్రతిభను మాత్రమే కాదు.. మీకు గల పోరాడే శక్తి, సింప్లిసిటీ, గర్వంలేని ఉదార స్వభావం వల్లే మేమంతా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం. మీరు, అభిషేక్ త్వరగా కోలుకోవాలి”అంటూ ట్వీట్ చేశారు పవన్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments