టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటారు ఈయన.ఈయన రూపొందించే మూవీల్లో కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే పాటల చిత్రీకరణలో.. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో దర్శకేంద్రుడి శైలి విభిన్నమైనది. తాజాగా ఈయన ఇంట్లోనే వ్యాయామాలు చేయడతో పాటు సైక్లింగ్ చేస్తున్నారు. ఈయన సైక్లింగ్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల పై పడిన వయసులో కూడా రాఘవేంద్రరావు ఫిట్‌నెస్ చూసి అభిమానులు ఆశ్యర్యపోతున్నారు. అంతేకాదు ఓ యువకుడు తొక్కినట్టు సైకిల్ తొక్కి అందిరినీ ఆశ్యర్య చకితులను చేసారు.

రాఘవేంద్రరావు ఇంట్లోనే లాన్‌లో సైకిల్ తొక్కిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు . అంతేకాదు ఈ ప్రపంచంలో మనకు అందించే వాటిలో ఉత్తమమైనవి. ప్రకృతి, ఆరోగ్యం, నమ్మదగిన స్నేహితుడు అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు సైకిల్ తొక్కుతుంటే.. ఆయన వెనకాల ఈయన పెంపుడు కుక్క కూడా ఉంది. దాన్నే ఆయన నమ్మదగిన స్నేహితుడుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అంతేకాదు కాదు తన వీడియోలో ప్రకృతితో పాటు ఆరోగ్యం, స్నేహితుడిని ఒక వీడియోలో చూపించారు రాఘవేంద్రరావు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments