వారు వీరు అనే తేడా లేకుండా కరోనా అందరిని తన వశం చేసుకుంటుంది. అయితే మన తెలంగాణ లో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1000 కి పైగా కేసులు నమోదవుతుంటే కేవలం హైదరాబాద్ లో మాత్రమే 80 శాతం కేసులు వస్తున్నాయి. దాంతో అక్కడ ఉన్న చాల మంది తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఇక ఇక్కడ బుల్లితెర పై ఉన్నంత కరోనా ప్రభావం వెండితెర పై లేదు. అయితే తాగాజా మెగాస్టార్ చిన్న అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇంస్టాగ్రామ్ లో వెల్లడించారు. అందులో.. నేను షూట్ ప్రారంభించినప్పటి నుండి ఒంటరిగా ఉన్నాను. తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అందులో నెగెటివ్ వచ్చింది. నా కుటుంబ సభ్యులను కలవడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. నా గురించి ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు! మీ ప్రేమ కలిగి ఉండటం నేను అదృష్టంగా భావిస్తాను” అని తన ఫ్యామిలీ ఫోటో షేర్ చేసారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments