రాంగోపాల్ వర్మ ఏది చేసిన సెన్సేషనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాను ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచడంలో దిట్ట వర్మ. ఈ దర్శకుడు ప్రస్తుతం పవర్‌స్టార చిత్రం తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లవ్ లీ బ్రదర్స్ అంటూ ట్విటర్లో పోస్ట్ చేసిన మూవీలోని పోస్టర్లకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా వర్మ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు మరో వార్త చక్కర్లు కొడుతోంది.
పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ 1998 జులై 24న విడుదలైన కెరీర్లో బ్లాక్‌బ్లాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే రోజు పవర్‌స్టార్ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆర్జీవీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ్ల ఇదే నిజమైతే ఆర్జీవీ మరో ట్విస్ట్ ఇస్తుండటం ఖాయమనే చెప్పాలి. ఆర్జీవీ రామోజీఫిల్మ్ సిటీలో పాతబడ్డ రిసార్ట్‌ను లీజ్ కు తీసుకున్నారట. అన్ని సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు ఈ రిసార్ట్ నుంచే కొనసాగించనున్నాడట.
చిన్న బడ్జెట్ చిత్రాలు తీసేందుకు ఆర్జీవీ ఎంపిక చేసుకున్న ఈ లొకేషన్ అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. లొకేషన్ల కోసం అన్వేషణ, రవాణా సౌకర్యం, స్టూడియోలు అద్దెకు తీసుకోవడం వంటివి లేకుండా చాలా సౌకర్యవంతంగా ఈ ప్రాంతాన్ని ఆర్జీవీ తనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకున్నట్టు టాక్.