పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శత్వంలో తెరకెక్కిన ‘బద్రి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది రేణు దేశాయ్. ఆ తర్వాత తన ఫస్ట్ సినిమా హీరో పవన్ కళ్యాణ్‌ను ఆ తర్వాత ప్రేమించి కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘జానీ’ సినిమాలో మాత్రమే నటించింది. ఇక రేణు దేశాయ్ విషయానికొస్తే.. ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఆ తర్వాత దర్శకురాలిగా ఓ సినిమా కూడా చేసింది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది. ఐతే.. ఇప్పటికీ కొంత మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను రెండో పెళ్లి చేసుకోవద్దంటూ బెదిరింపులు కూడా దిగారు.

తాజాగా రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను మళ్లీ చేసుకున్నా.. చేసుకోకపోయినా.. కొంత మంది బాధగా ఉందన్నారు. వీళ్లందరి క్లారిటీ ఇవ్వడానికైనా పెళ్లిగోల అంటూ ఒక బయోపిక్ తీస్తానని కాస్త కామెడీగా సెలవిచ్చింది. నా బతుకు ఏదో బతుకున్న నాకు..కొంత మంది పనిగట్టుకొని మరి నా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ రేణు వ్యాఖ్యానించింది. మీ ఇంట్లో ఉన్న అక్కకో.. చెల్లెలుకో ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఇలానే చేస్తారా అంటూ కాస్తంత ఎమోషనల్ అయింది. ఏమైనా విడాకులు ఇచ్చిన తర్వాత ఎవరి జీవితం వారిదే కదా ఇందులో వేరెకరి జోక్యం ఎందుకు అంటూ చెప్పుకొచ్చింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments