ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే చేస్తోంది. దాదాపు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫష్ట్ లుక్‌తో పాటు టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ రోజు బాహుబలి .. ఫస్ట్ పార్ట్ రిలీజై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్.. ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఇప్పటికే బాహుబలి సినిమా విడుదలైన ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూవీ క్రియేషన్స్ వాళ్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ప్రభాస, పూజా హెగ్డేల పోస్టర్‌ చాలా రొమాంటిక్‌గా ఉంది.

ప్రభాస్ 20 ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా.. పిరియాడిక్ జానర్‌లో ఉండనుందని సమాచారం. ఈ సినిమా పోస్టర్స్‌ చూస్తుంటే.. ఇటలీ వరదల్లో చిక్కుకున్న ప్రేమికులు.. ఆ తర్వాత ఎలా కలసుకున్నారనే దానిపై ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్నట్టు కనబడుతోంది. అంతేకాదు ఈ సినిమాను పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్తా అయోమయంలో ఉన్నారు అభిమానులు. మొన్నటి వరకు జాన్ అంటూ ప్రచారం అవ్వగా.. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ అంటున్నారు. చిరవగా ‘రాధే శ్యామ్’ టైటిల్‌ను కన్ఫామ్ చేసారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఈ సినిమాలో పూజా పాత్ర రాధ అయితే.. ప్రభాస్ శ్యామ్ పాత్రలో కనిపించనున్నాడు.

వస్తోన్న సమాచారం మేరకు ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. ఈ సినిమా కథ చాలా కాలం క్రితం జరుగుతుంది గనుక, అప్పటికి సంబంధించిన ఓల్డ్ లుక్ తోనే పూజ కనిపించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ అంతేకాదు ఈ సినిమాలో పూజా చాలా కొత్తగా కనబడుతూ.. ఇంతవరకూ పూజ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments